Posts

Showing posts from January, 2013

ప్రవాస భారతీయ దినోత్సవం

Image
N R I DAY ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము ఏ పూర్వపుణ్యమో, ఏ యోగ బలమో జనియించినవాడ నీ స్వర్గఖండమున ఏ మంచి పూవులన్‌ ప్రేమించినావో నినుమోసె ఈ తల్లి కనక గర్భమున లేదురా ఇటువంటి భూదేవి యెందు లేదురా మనవంటి పౌరులింకెందు సూర్యుని వెలుతురుల్ సోకునందాక ఓడల ఝండాలు ఆడునందాక అందాక గల ఈ అనంత భూతల్లిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు పాడరా నీ తెలుగు బాలగీతములు పాడరా నీ వీర భావ గీతములు