భారతీయ సినీ రంగ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే జన్మదినం సందర్భంగా 1969 నుంచి ప్రారంభించి ప్రతీ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలు ఇ స్తూ ఉంది. ఇది భారత చలన చిత్ర రంగంలో నే అత్యున్నత పురస్కారం . చలన చిత్ర రంగానికి విశేష సేవలు అందించిన వారి జాబితాని రెండు నెలల పాటు కాచి వడపోసి సంవత్సరానికి ఒక్కరిని ఎం పిక చే సి బంగారు కమలం , పది లక్షల రూపాయల నగదు, శాలువాతో సత్కరిస్తారు . ఇప్పటికి 5 గురు తెలుగు చలన చిత్ర ప్రముఖులు,1 తెలుగు ప్రముఖుడు, ఇద్దరు తెలుగు నేలపై పుట్టిన వారు వెరసి 8 మంది తెలుగు నేల/భాష కు చెందిన వారు ఈ పురస్కారాన్ని సొంతం చేసుకో న్నారు. తెలుగు చలన చిత్ర ప్రముఖులు: 1974: బొమ్మిరెడ్డి నరసింహ రెడ్డి ( దర్శకులు ) 1982: ఆక్కినేని లక్ష్మీ వర ఫ్రసాద రావు ( నటులు , దర్శకులు , నిర్మాత ) 1986: బొమ్మిరెడ్డి నాగి రెడ్డి ( నిర్మాత ) 1990: ఆక్కినేని నాగేశ్వర రావు ( నటులు ) 2009: దగ్గుబాటి రామా నాయుడు ( నిర్మాత ) తెలుగు ప్రముఖుడు: 1980: పైడి జైరాజ్ ( నటులు ,...