పై వారెవరు కారు




అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశ ఎన్నికల్లో ఓటుకు చాలా ప్రాధాన్యత వుంది.మరి నిలబడిన అభ్యర్ధికీ మన ఓటు పొందే అర్హతలేదనిపిస్తే ఏంచెయ్యాలి. పోలింగ్ కేంద్రంలో రాకను నమోదు చేసుకొని ఓటు వేయకుండా వచ్చేసే అవకాశం ఇప్పటికే వున్నా దాని వల్ల ఫలితాలేమీ మారవనో లేదా రాజకీయ పక్షాల కోపానికి గురి కాలేకో గోప్యతలేని అవకాశాన్ని సాధారణంగా వాడుకోం. ఇలా వదిలేసిన ఓటు వేరొకరు వినియోగించుకొని తమవారికి దొంగ ఓటు వేసుకోవటమో లేక ఓటింగ్ శాతం తగ్గటమో జరిగి ప్రజస్వామ్య స్పూర్తి నీరుగారిపోతుంది. దీన్ని నివారించటానికి నిర్బంధ ఓటింగ్ను అమలు చేయాలని కొందరు అభిప్రాయపడ తారు. కానీ బలవంతంగా ఓటు వేయించడం అప్రజాస్వా మికం. ఓటు వేసే లేక వేయకుండా ఉండే స్వేచ్ఛ ఓటర్లకుంది.

ఇవన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం 'రహస్య ఓటింగ్' స్పూర్తి కలిగిన కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇక నుండి ఈవీఎంలలో అభ్యర్థుల జాబితాలో చివరి పేరుగా 'నన్ ఆఫ్ ఎబవ్ (పై వారెవరు కారు)' అనే పద బంధం, దీర్ఘ చతురస్రాకారంలోనోటాఅని పెద్ద ఆంగ్ల అక్షరాలతో ముద్రించిన చిహ్నం తో కూడిన  మీట కూడా ఏర్పాటు చేస్తారు.’నన్ ఆఫ్ ఎబవ్పద బంధం స్థానిక భాషల్లోనూ ముద్రిస్తారు. అభ్యర్థుల కొచ్చిన ఓట్లతో పాటు,నోటా కు వచ్చిన ఓట్లను కూడా ప్రకటిస్తారు.





మన దేశం లో ఈ మద్య జరిగిన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు తొలిసారిగా ‘నోటా’ అవకాశం కల్పించారు. ఇప్పటికే ఫ్రాన్స్, బెల్జియం, బ్రెజిల్, గ్రీస్, ఉక్రెయిన్, చిలీ, బంగ్లాదేశ్, ఫిన్లాండ్, స్వీడన్, కొలంబియా, స్పెయిన్‌,అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో ఓటర్లకు ఈ విధమైన అవకాశం కల్పించారు. ఈ విదమైన అవకాశం కల్పించిన 14వ దేశం మనది. నోటా ఓటు కు ఎన్నికల సంఘం విశేష ప్రచారం కలిగించనుంది.
‘పై వారెవరు కారు(నోటా)’ కు ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ,బరిలో ఉన్న వారిలో మెజారిటీ ఓట్లు వచ్చిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు తప్పా తిరిగి ఎన్నికలు నిర్వహించరు. పదే పదే ఎన్నికలు నిర్వహిస్తే ప్రజా దనం వృదా కావటమేకాక, ఓటర్లలో ఎన్నికల అలసట మొదలై మొదటికే మోసం వచ్చే అవకాశం ఉండటమే దీనికి కారణం.
కానీ ఈ ప్రయోగం వలన తాము నిలబెడుతున్న అభ్యర్థుల పట్ల ఓటర్లకు సదభిప్రాయం లేదన్న విషయం రాజకీయ పక్షాలకి అర్థ మై తదుపరి ఎన్నికలలో నోటా ఓట్లను మళ్ళించుకొనేందుకైన కనీస నైతిక విలువలు కలిగిన వ్యక్తులను నిలబెడతారు. రాజకీయ పక్షాలకి తమ అభ్యర్థుల నైతికత పట్ల శ్రద్ధ పెంచేందుకు ఈ ప్రయోగం దోహదం చేస్తుంది.

Comments

Popular posts from this blog

నూతన సంవత్సర శుభాకాంక్షలు